Chandrababu Naidu : నా బాధ, ఆవేదన అదే : జడ్జి ఎదుట చంద్రబాబు ఆవేదన

by Disha Web Desk 21 |
Chandrababu Naidu : నా బాధ, ఆవేదన అదే : జడ్జి ఎదుట చంద్రబాబు ఆవేదన
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్ గడువు నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడును వర్చువల్‌గా సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా జ్యుడిషియల్ రిమాండ్‌పై విచారణ జరిగింది. ఈ విచారణలో చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనను అకారణంగా జైల్లో పెట్టారు అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తనను స్కిల్ స్కామ్ కేసులో అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు జడ్జికి తెలియజేశారు. రాజకీయ కక్షలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని చంద్రబాబు జడ్జి ఎదుట ఆరోపించారు. అకారణంగా తనను జైల్లో పెట్టారనే బాధ, ఆవేదన ఉంది అని చంద్రబాబు వాపోయారు. తన గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలను జడ్జి నోట్ చేసుకున్నారు. తన వివరణ తీసుకోకుండానే అరెస్ట్ చేశారని...తన అరెస్ట్ అక్రమమని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం కలిగిన తనకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తన హక్కులను కాపాడాలని, న్యాయాన్ని రక్షించాలని జడ్జిని కోరారు. జైల్లో తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం అందరికీ సమానమేనన్న జడ్జి తెలిపారు. మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయి. దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయి. రిమాండ్‌ను శిక్షగా భావించొద్దు. ఇది చట్ట ప్రకారం జరుగుతున్న కార్యక్రమం’ అని ఏసీబీ కోర్టు జడ్జి అన్నారు. జైల్లో సౌకర్యాలపైనా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబు నాయుడును అడిగి తెలుసుకున్నారు.



Next Story

Most Viewed