Mp VijayasaiReddy: 98 శాతానికి పైగా హామీల అమలు

by Disha Web Desk 16 |
Mp VijayasaiReddy: 98 శాతానికి పైగా హామీల అమలు
X

దిశ, ఏపీ బ్యూరో: మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98 శాతానికి పైగా అమలు చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుందని, గడిచిన నాలుగేళ్లలో రూ.2.10 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేసి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా బుధవారం పలు అంశాలు వెల్లడించారు. గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్ మరి చంద్రబాబు జగన్ మాదిరిగా ఎందుకు హామీలను అమలు చేయలేకపోయాడని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన నిబద్ధతను జవాబుదారీతనాన్ని నిరూపించుకుంటే, గత చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా వారి మేనిఫెస్టోనే మాయం చేసిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కడలి పుత్రులకు అండగా నిలవడంతో ఎల్లవేళలా ముందుంటుందని విజయసాయిరెడ్డి అన్నారు.

వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు చొప్పున రూ.123.52 కోట్ల సాయం అందించిందని విజయసాయిరెడ్డి అన్నారు. అలాగే ఓఎన్జీసీ పైప్ లైన్ బాధితుల కుటుంబాలకు రూ.107.91 కోట్లు అందించిందని తెలిపారు. 1,23,519 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూర్చిందని, మొత్తంగా నాలుగేళ్లలో 538 కోట్ల సాయం అందించి కడలి పుత్రులపై తన అభిమానాన్ని చాటుకుందని విజయసాయిరెడ్డి చెప్పారు.

Also Read..

Chandrababu: రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది



Next Story

Most Viewed