పిఠాపురంలో దొరబాబు బల ప్రదర్శన.. రాజకీయవర్గాల్లో చర్చ..

by Indraja |
పిఠాపురంలో దొరబాబు బల ప్రదర్శన.. రాజకీయవర్గాల్లో చర్చ..
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో విజయభేరిని మోగించి వైసీపీ జెండాను రేపేరెపలాడించేందుకు వైసీపీ అధినేత సీఎం జగన్ పక్కా ప్రణాలికను రూపొందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అధికార ధోరణితో వ్యవహరిస్తూ ఇంచార్జ్ లను మారుస్తున్నారు. కాగా అధికార పార్టీలో చోటుచేసుకుంటున్నఈ మార్పులు చేర్పులు ఆ పార్టీలో చిచ్చుపెడుతున్నాయి. ఇప్పటికే పలువురు సెట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీకి బై బై చెప్పి వేరే పార్టీల గూటికి చేరారు. మరి కొంతమంది నేతలు పార్టీని వీడేందుకు సంసిద్ధమవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సీటు దక్కని సిట్టింగ్ ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు సీటు దక్కకపోవడంతో రగిలిపోతున్నారు.

తమకు తమ నియోజకవర్గాలలో ఉన్న బలాన్ని అధికార పార్టీ అధిష్టానికి తెలియజెప్పేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ కోవలోకే పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు కూడా వస్తారు.. పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న తనను పక్కన పెట్టి పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రస్తుతం ఎంపీ గా ఉన్న వంగా గీతాకు కేటాయించింది వైసీపీ అధిష్టానం. దీనితో తనని కాదని తన నియోజకవర్గాన్ని వేరే అభ్యర్ధికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని దొరబాబు ఆ నియోజకవర్గంలో తనకున్న బలాన్ని, బలగాన్ని వైసీపీ అధిష్టానానికి చూపించాలి అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పక్కా ప్రణాళికతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. నియోజకవర్గ పరిధి లోని నాలుగు మండలాల నుంచి కేడర్లు వచ్చేలా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. సమావేశానికి హాజరయ్యే వారి కోసం ప్రత్యేక విందులు ఏర్పాటు చేశారు. కాగా పుట్టిన రోజు సాక్షిగా తన నియోజకవర్గంలో తనకున్న బలాన్ని వైసీపీ అధిష్టానానికి తెలియచెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సమావేశంలో ఆయన పొలిటికల్ గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రస్తుతం అటు నేతల్లోనూ ఇటు ప్రజల్లోనూ నెలకొన్న చర్చ.

Advertisement

Next Story