మహాశివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైల క్షేత్రం

by Dishafeatures2 |
మహాశివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైల క్షేత్రం
X

దిశ, శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నవాహ్నిక దీక్షతో 21వ తేదీ దాకా 11రోజులపాటు కొనసాగే ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీశైల దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్.లవన్న ఆయా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులకు అభివృద్ధి పనులపై తగు సూచనలు చేస్తున్నారు. సామాన్య భక్తులకు స్వామి అమ్మవార్ల సంతృప్తికర దర్శన భాగ్యం కలిగించే విధంగా ఈవో చర్యలు తీసుకుంటున్నారు.

బ్రహ్మోత్సవ కార్యక్రమాలు

11వ తేదీ ఉదయం 8.46గంటల. నుంచి దేవస్థానం అధికారులు, అర్చకులు,వేదపండితులు స్వామివారి ఆలయ యాగశాల ప్రవేశం అనంతరం వేదస్వస్తి, శివసంకల్ప జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు నిర్వహిస్తారు. సాయంత్రం 5.30గంటలకు సాయంకాలార్చనలు,అగ్నిప్రతిష్ఠాపన,అంకురార్పణ,రాత్రి 7 గంటల నుంచి త్రిశూలపూజ,భేరిపూజ, భేరీతాండవం,సకలదేవతాహ్వానపూర్వక ధ్వజారోహణ, ధ్వజపతాకావిష్కరణ కార్యక్రమాలు జరుగుతాయి.12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8గంటలకు చండీశ్వరపూజ,మండపారాధన, కలశార్చనలు,పంచావరణార్చనలు, జపానుష్ఠానాలు,రుద్రపారాయణల,నిత్యబలిహరణలు, నిత్యహవనాలు నిర్వహిస్తారు. పఠనం,మహాగణపతిపూజ, పుణ్యాహవాచనం,చండీశ్వరపూజ, కంకణ పూజ,కంకణధారణ,రుత్విగరణ అఖండదీపారాధన,వాస్తుపూజ, వాస్తు హోమం,మండపారాధన, రుద్రకలశస్థాపన,పంచావరణార్చన,శివపంచాక్షరి నిర్వహిస్తారు.


13న కాణిపాక దేవస్థానంచే పట్టువస్త్రాలు

ఈనెల 13 న కాణిపాక దేవస్థానంచే పట్టువస్త్రాలు సమర్పణ,14న విజయవాడ దుర్గాదేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే పట్టువస్త్రాల సమర్పణ, అలాగే 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం వారిచే స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ జరుగుతుంది.18వ తేదీన మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంత్రం 5.30గంటలకు ప్రభోత్సవం,రాత్రి 7గంటలకు నందివాహనసేవ,10గంటలకు లింగోద్భవకాల మహన్యాసపూర్వక రుద్రాభిషేకం,పాగాలంకరణ, 12గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల లీలాకళ్యాణ మహోత్సవం జరుగుతుంది.19వ తేదీన మధ్యాహ్నం 4గంటలకు రథాంగపూజ,రథాంగహోమం, రథాంగబలి,5గంటలకు రథోత్సవం, రాత్రి 8గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు.


20వ తేదీన బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి

కలశోద్వాసన,అవబృధం,త్రిశూల తీర్థోత్సవం,మహదాశీర్వచనం, సాయంత్రం 6గంటలకు సదస్యం, దర్బారు సేవ,మృగయాత్రోత్సవం, చోరోత్సవం రాత్రి 7గంటలకు ధ్వజావరోహణ,మూకబలి జరుగుతుంది.21వ తేదీన రాత్రి 8గంటలకు అశ్వవాహనసేవ, ఆలయ ఉత్సవం,8గంటలకు పుష్పోత్సవం,శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహిస్తారు.

రోజువారీ వాహనసేవలు

బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజునుంచి వాహనసేవలు,గ్రామోత్సవాలు జరుగుతాయి.ఇందులో 12వ తేదీన భృంగివాహనసేవ,13న హంస, 14న మయూర,15న రావణ,16న పుష్పపల్లకీసేవ,17న గజవాహన, 18న నందివాహనసేవ,19న రథోత్సవం,20న పూర్ణాహుతి,21వ తేదీన అశ్వవాహన సేవలు జరుగుతాయి.

Read more:

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం.. మంత్రి కారుమూరి



Next Story