ఢిల్లీ లిక్కర్ స్కామ్: మాగుంట రాఘవ రిమాండ్ పొడగించిన స్పెషల్ కోర్టు

by Satheesh |
ఢిల్లీ లిక్కర్ స్కామ్: మాగుంట రాఘవ రిమాండ్ పొడగించిన స్పెషల్ కోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారం ఈడీ ఎంక్వయిరీకి హాజరుకాలేదు. సమీప బంధువుల్లో ఒకరికి ఆపద రావడంతో అర్జెంటుగా చెన్నయ్ వెళ్ళాల్సి వచ్చిందని, ఈ కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు లాయర్ ద్వారా ఈడీ అధికారులకు సమాచారం పంపారు. మరోవైపు ఆయన కుమారుడు మాగుంట రాఘవ జ్యుడిషియల్ రిమాండ్‌ను రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు ఈ నెల 28 వరకూ పొడిగించింది. ఆయన రిమాండ్ శనివారంతో ముగియడంతో కోర్టులో హాజరుపరిచిన ఈడీ.. లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక దశకు చేరుకున్నదని, పురోగతిలో ఉన్నదని, ఈ కారణంగా ఆయన జ్యుడిషియల్ కస్టడీని మరిన్ని రోజులు పొడిగించాలని వివరించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న రాఘవను మరికొన్ని రోజుల పాటు అక్కడే ఉంచడం దర్యాప్తునకు అవసరమని ఈడీ తరఫు న్యాయవాది స్పెషల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనితో ఏకీభవించిన కోర్టు ఈ నెల 28 వరకూ జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

Next Story

Most Viewed