లిక్కర్ డేటాను రహస్యంగా ఉంచుతోంది..డేటా వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలి: అచ్చెన్నాయుడు

by Disha Web Desk 21 |
లిక్కర్ డేటాను రహస్యంగా ఉంచుతోంది..డేటా వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలి: అచ్చెన్నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : లిక్కర్ అమ్మకాలు, ఆదాయాల డేటా వెబ్ సైట్‌ను తొలగించడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎ కేఎస్ జవహర్ రెడ్డికి లేఖరాశారు. వైసీపీ ప్రభుత్వం పారదర్శకతకు పాతరేస్తోంది అని లేఖలో ధ్వజమెత్తారు. ప్రజల ముందు ఉంచాల్సిన సమాచారాన్ని రహస్యంగా ఉంచుతోంది అని మండిపడ్డారు. ‘మొన్నటి వరకు ప్రభుత్వ జీవోలను రహస్యంగా ఉంచారు. హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు పబ్లిక్ డొమైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. గుడ్ గవర్నెన్స్‌లో భాగంగా టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పారదర్శకత, జవాబుదారీతనాన్ని వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. లిక్కర్‌ అమ్మకాలు, ఆదాయాలకు సంబంధించిన డేటాను వైసీపీ ప్రభుత్వం వెబ్ సైట్ నుంచి తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లిక్కర్ ఆదాయం ఎక్కడికి వెళుతోందో మీకు తెలుసే ఉంటుంది అంటూ ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా పారదర్శకత కోసం డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు మళ్లుతుంటే ఏపీలో మాత్రం క్యాష్ ట్రాన్సాక్షన్‌లో మాత్రమే అమ్మకాలు చేస్తోంది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

రాజకీయ లబ్ధికోసం నేతల ఒత్తిడి

వైసీపీ నాయకులు వారి రాజకీయ లబ్దికోసం అధికారులు తప్పులు చేసేలా ఒత్తిడి చేస్తున్నారు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాజకీయ నాయకులు ఒత్తడిలకు తలొగ్గి అధికారులు తప్పులు చేస్తే ఇబ్బందులు పడుతారని మండిపడ్డారు. మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న సందర్భంలో ఎన్నికల సంఘం కంటపడకుండా ఉండేందుకు వైసీపీ ప్రభుత్వం లిక్కర్ డేటాను రహస్యంగా ఉంచుతోంది అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ‘కోర్టు స్క్రూటినీ నుంచి తప్పించుకునేందుకు, లిక్కర్ డేటానే తారుమారు చేసేందుకు లిక్కర్ డేటాను వెబ్ సైట్‌ నుంచి తొలగించారు. వైసీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గకుండా అధికారులు చట్టం ప్రకారం పనిచేసేలా చూడండి.లిక్కర్ అమ్మకాల, ఆదాయాలకు సంబంధించిన డేటా వెబ్ సైట్‌ను పునరుద్దరించాలి’అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed