RSC Demands: తీగల వంతెన వద్దు.. బ్రిడ్జి కమ్ బ్యారేజీ కావాలి

by Disha Web Desk 16 |
RSC Demands: తీగల వంతెన వద్దు.. బ్రిడ్జి కమ్ బ్యారేజీ కావాలి
X

దిశ, కర్నూలు ప్రతినిధి: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ కేంద్రప్రభుత్వం కల్వకుర్తి-నంద్యాల పేరుతో 167 కే జాతీయ రహదారి నిర్మిస్తోంది. అంతేకాదు సిద్దేశ్వరం-సోమశిల మధ్య కృష్ణానదిపై తీగల వంతెన నిర్మించాలని నిర్ణయించింది. అయితే ఈ రోడ్డు నిర్మాణంపై వ్యతిరేకమవుతోంది. అయితే తీగల వంతెనకు బదులు బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించాలని రాయలసీమ స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని ఆ కమిటీ సభ్యులు రమణారెడ్డి, సుబ్బరాయుడు, తదితరులు డిమాండ్ చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు స్టీరింగ్ కమిటీ సభ్యులు వినతిపత్రాలు అందజేసి మాట్లాడారు. ఈ జాతీయ రహదారి తెలంగాణలోని వెనుకబడ్డ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని మన వెనుక బడ్డ నంద్యాల జిల్లాకు ఎంతో అవసరమన్నారు. ఈ జాతీయ రహదారి నిర్మాణాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి వల్ల వెనుకబడ్డ రాయలసీమకు ఎలాంటి ఉపయోగం లేదని, కేవలం సెల్ఫీలు, టూరిజంకు మాత్రమే ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Next Story