Naralokesh: దోచుకుని దాచుకోవడమే జగన్‌కు తెలుసు

by srinivas |
Naralokesh: దోచుకుని దాచుకోవడమే జగన్‌కు తెలుసు
X

దిశ, కర్నూలు ప్రతినిధి: సీఎం జగన్‌కు ప్రజా సమస్యలు పట్టవని, ప్రజల నుంచి దోచుకుని దాచుకోవడమే తప్ప బాగోగుల గురించి పట్టించుకోలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. లోకేశ్ యువగళం పాదయాత్ర పత్తికొండ నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై నారా లోకేశ్ విమర్శలు చేశారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప గ్రామాలభివృద్ధిపై శ్రద్ధలేదని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల కి.మీ. సీసీ రోడ్లు వేశామని చెప్పారు.

అలాగే తమ ప్రభుత్వం అధికారంలో కొచ్చిన వెంటనే కలచట్ల చెరువుకు హంద్రీనీవా నీళ్లిస్తామని హామీచ్చారు. ఇళ్లు లేని పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తామని మాటిచ్చారు. రాంపల్లి సర్కిల్ వద్ద బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పత్తికొండ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఈ విషయం ఎమ్మెల్యే శ్రీదేవికి కూడా తెలుసన్నారు. ఎమ్మెల్యే గళం విప్పాలని సవాల్ విసిరారు.

Advertisement

Next Story