Ugadi: భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి

by Disha Web Desk 16 |
Ugadi: భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో‌: ఉగాదిని పురస్కరించుకుని బెజవాడ కనకదుర్గమ్మ వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వసంత నవరాత్రుల్లో భాగంగా చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్ర శుద్ధ దశమి వరకు ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం మండప పూజలు, హోమాలు, పారాయణాలు నిర్వహిస్తుంటారు. ఇక అమ్మవారి వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉగాది రోజు విజయవాడ కనకదుర్గాదేవి మూలవిగ్రహానికి పంచామృతాలతో, శుద్ధోదకంతో, ఉష్ణోదకంతో, వివిధ పరిమళ సుగంధద్రవ్యాలతో స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం మూలవిరాట్టుకు ముఖాలంకారాన్ని చేశారు.

ఆ తర్వాత యధావిధిగా ప్రాతః కాలార్చన చేసి, బాలభోగాన్ని నివేదించారు. స్నపనాభిషేకంలో పాల్గొన్న వారందరికీ అమ్మవారికి పూసిన గంధాన్ని, అభిషేకం చేసిన తీర్థాన్ని ప్రసాదంగా అందజేశారు. అభిషేకానంతరం సర్వదర్శనానికి అనుమతినిచ్చారు. స్నపనాభిషేకం తరువాత కలశస్థాపన, ఆ తరువాత క్రమంగా అగ్ని ప్రతిష్ఠాపన, హోమాలు, వేదపారాయణం నిర్వహించారు.

ఇవి కూడా చదవండి : Nukalamma Jathara: జాతరలో కొట్లాట... ఒకరు మృతి

Next Story

Most Viewed