పొత్తులు కుదిరిన వేళ.. జనసైనికులకు కీలక సందేశం

by Disha Web Desk 16 |
పొత్తులు కుదిరిన వేళ.. జనసైనికులకు కీలక సందేశం
X

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో పొత్తు అవసరాలపై నేతలు, కార్యకర్తలకు ఆయా పార్టీల అధినేత అధినాయకులు వివరణ ఇచ్చారు. ఢిల్లీ నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా పొత్తుల ఆవశ్యకతను వివరించారు. అటు జనసేన కూడా పార్టీ శ్రేణులకు, కార్యకర్తలు వివరణ ఇచ్చింది. ఈ మేరకు పొత్తులపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తన ట్విట్టర్ ద్వారా కీలక సందేశం విడుదల చేశారు.


‘ఆలోచించాల్సిన సమయం కాదిది. నాయకుడి ఆదేశాలని‌ ఆచరణలో పెట్టాల్సిన సమయం. సందిగ్ధాల సమయం కాదిది, సమరానికి సిద్దమవ్వాల్సిన సమయం. విమర్శ, విభేదాల సమయం కాదిది, విజ్ఞతతో విజయ దుందుభి మోగించాల్సిన సమయం. శత్రువు మాయలో పడి నాలుగేళ్ల దగా మర్చిపోతున్నావ్. తీర్చుకోవాల్సిన పగా మర్చిపోతున్నావ్. నిర్లక్ష్యం వీడు, నిజాన్ని చూడు. నమ్మి నాయకుడి నిర్ణయాలతో నిలబడు. సేనా..సిద్దం సిద్దం అన్నోళ్ళకి ఈసారి ఇద్దాం మర్చిపోలేని యుద్ధం’ అని జనసేన శ్రేణులు, కార్యకర్తలను నాగబాబు పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed