Breaking: ఎన్నికల ప్రచారానికి పవన్ .. జోనల్ కమిటీలకు అప్పగించిన బాధ్యతలు ఇవే..

by Disha Web Desk 16 |
Breaking: ఎన్నికల ప్రచారానికి  పవన్ ..  జోనల్ కమిటీలకు అప్పగించిన బాధ్యతలు ఇవే..
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. టీడీపీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే సీట్ల వ్యవహారం తేల్చాల్సి ఉంది. కానీ ఎన్నికల ప్రచారంపై పవన్ కల్యాణ్ కసరత్తులు చేస్తున్నారు. మార్చి నుంచి ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించారు. ఈ ప్రచారంలో టీడీపీ, జనసేన కూటమికి ఓటు వేయాలని పవన్ కోరనున్నారు. ఈ మేరకు ఉమ్మడిగా రూట్ మ్యాప్‌‌ను రూపొందించనున్నారు.

ఇందులో భాగంగా ఆ పార్టీ నేతలు కసరత్తులు ప్రారంభించారు. తాజాగా జనసేన జోనల్ కమిటీలతో నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలాఖరు నుంచి పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారని తెలిపారు. ఫిబ్రవరితో క్షేత్ర స్థాయిలో పర్యటించి నేతలతో సమావేశాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మార్చిలో మూడు వారాల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారని ఇందుకు పార్టీ జోనల్ కమిటీలు సిద్ధంగా ఉండాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. జనసేన, టీడీపీ అభ్యర్థుల విజయం కోసం పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రతి రోజు మూడు సభల్లో పవన్ ప్రసంగించనున్నట్లు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలను విజయం చేయాల్సిన బాధ్యతలను జోనల్ కమిటీలకు అప్పగించారు. పవన్ కోసం పని చేసే ప్రతి జనసైనికుడిని గుర్తుపెట్టుకుంటామని నాదెండ్ల మనోహన్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed