చిట్ నిర్వహణపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

by Disha Web Desk 4 |
చిట్ నిర్వహణపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో : చిట్ నిర్వహణలో ఏపీ ప్రభుత్వం కొత్త విధానం తీసుకువచ్చింది. రాష్ట్రంలో చిట్ ఫండ్ వ్యాపారం పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇక నుంచి అంతా ఆన్ లైన్ విధానంలోనే చిట్ నిర్వహణ జరగాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇ- చిట్స్‌ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్‌ను రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. కొత్త విధానం ప్రకారం అన్ని చిట్ ఫండ్ కంపెనీలు ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించాలి అని సూచించారు. ఏపీ రెవిన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలు ఇ - చిట్స్‌ ఎలక్ట్రానిక్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

చందాదారులు ఇ - చిట్స్‌ ద్వారా తన డబ్బు సురక్షితంగా ఉందో లేదో కొత్త విధానం ద్వారా తెలుసుకోవచ్చు. చందాదారులు మోసపోకుండా చూడాలనే ఈ విధానం తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆన్‌ లైన్‌లో పరిశీలించి..ఆమోదం తెలియజేస్తారు అని చెప్పుకొచ్చారు. ఈ విధానం ద్వారానే చిట్స్ కంపెనీలు లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. గతంలో నమోదు అయిన సంస్థలు క్రమంగా ఈ విధానంలోకి రావాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు.

Also Read...

పొగడ్తలతో పొట్ట నిండేనా.. లీడర్లను చేస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు



Next Story

Most Viewed