Amaravati: IRR Case విచారణ.. ఏజీ శ్రీరామ్ వాదనలు వాదనలు ఇవే..

by Disha Web Desk 16 |
Amaravati: IRR Case విచారణ.. ఏజీ శ్రీరామ్ వాదనలు వాదనలు ఇవే..
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ హైకోర్టులో ఐఆర్ఆర్ కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో చంద్రబాబు తరపున పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతో ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తున్నారు. అమరావతి పరిధిలో నిర్మించబోయే ఇన్నర్‌రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్‌లో మార్పులు చేశారని.. తద్వారా చంద్రబాబు తన సన్నిహితులకు లబ్ధి చేకూర్చారని వాదిస్తున్నారు. రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే మాజీ మంత్రి నారాయణ, మరికొందరు అక్కడ భూములు కొన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలా లబ్ధి చేకూర్చడంతోనే ఉండవల్లి కరకట్ట వద్ద లింగమనేనికి చెందిన తన గెస్ట్ హౌస్‌ను చంద్రబాబుకు ఎలాంటి రెంట్ రసీదులు లేకుండానే ఇచ్చారని ధర్మాసనం ముందు ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని.. సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ఏజీ శ్రీరామ్ వాదిస్తున్నారు. హైకోర్డులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. ఇరువర్గాల వాదనలతో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతోందో మరికాసేపట్లో తెలియనుంది.



Next Story

Most Viewed