నిరూపిస్తే రాజీనామా చేస్తా.. నువ్వు వైదొలుగుతావా?.. బాలినేని సవాల్

by Ramesh Goud |   ( Updated:2024-03-04 14:25:27.0  )
నిరూపిస్తే రాజీనామా చేస్తా.. నువ్వు వైదొలుగుతావా?.. బాలినేని సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల పట్టాలు దొంగ పట్టాలని దుష్ర్పాచారం చేస్తున్నారని, దొంగ పట్టాలని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని బాలినేని సవాల్ విసిరారు. ఒంగోలులో పేదలకు 25 వేల ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేపట్టారు. అబ్దిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు నూతన వస్త్రాలు కూడా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంతకాలం ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని దుష్ర్పాచారం చేశారని, ఇప్పుడు ఇస్తుంటే దొంగ పట్టాలని అంటున్నారని టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ పై బాలినేని మండిపడ్డారు. అంతేగాక దామచర్ల దొంగ మాటలు మాట్లాడుతున్నారని, తాము ఇచ్చేవి దొంగ పట్టాలని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, దొంగ పట్టాలని నిరూపించలేకపోతే పోటీ నుంచి వైదొలగడానికి సిద్దమా చెప్పాలని సవాల్ విసిరారు.

Also Read..

ఎమ్మెల్యే అక్రమాలపై పల్నాడు లో చర్చ..ఉతికి ఆరేసిన చంద్రబాబు?

Advertisement

Next Story