Chicken : కొండెక్కిన చికెన్ ధరలు.. కేజీ రేట్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

by Disha Web Desk 7 |
Chicken : కొండెక్కిన చికెన్ ధరలు.. కేజీ రేట్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. వారానికి కనీసం రెండు సార్లైనా తినకుండా అస్సలు ఉండలేరు. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో ఈ ప్రభావం రేట్లపై పడింది. తాజాగా, ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న మాంసం ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. కోళ్ల ఫారం వారు హోల్‌సేల్ వ్యాపారులకు సరఫరా దారులు రూ.150 ధర నిర్ణయించగా, రిటైర్లకు రూ. 165 వరకూ విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో బాయిలర్ కోడి కేజీ హోల్‌సేల్ ధర రూ. 170 కాగా చికెన్ కేజీ 300, బోన్‌లెస్ రూ.400 వరకూ విక్రయిస్తున్నారు. అయితే కోళ్ల కొత్త బ్యాచ్ వచ్చే వరకు ఇవే ధరలు ఉంటాయని వ్యాపారులు తెలిపారు. చికెన్ రేట్లు కొండెక్కడంతో వ్యాపారులు కోళ్ల ఫారంలో ఉన్న కేజీన్నర దాటిన వాటిని విక్రయిస్తున్నారు. చికెన్ రేట్లు పెరుగుతున్నా విక్రయాలు మాత్రం తగ్గడం లేదు. అంతేకాకుండా ఈ ధరలు జూన్ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more:

Red Banana: ఎర్ర అరటి పండు మన ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలుసా?


Next Story