చంద్రబాబుకు అనారోగ్యం.. స్పందించిన సెంట్రల్ జైలు అధికారులు

by GSrikanth |
చంద్రబాబుకు అనారోగ్యం.. స్పందించిన సెంట్రల్ జైలు అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అనారోగ్యానికి గురయ్యారని వార్తలు విస్తృమయ్యాయి. స్కిన్ ఎలర్జీ రావడంతో గురువారం డాక్టర్లు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించారని సమాచారం. తాజాగా.. ఈ కథనాలపై స్పందించిన రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ‘రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి ఇద్దరు వైద్యులు చంద్రబాబును పరీక్షించారు. వారి సూచనల మేరకు చంద్రబాబుకు వైద్య సహాయం అందజేస్తున్నాం. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.

హెల్త్ బులిటెన్

బీపీ = 140/80

టెంపరేచర్ = 1నార్మల్

పల్స్ = 187

Spo2 = 197 (ఆక్సిజన్ సాచురేషన్)

Heart = 1s1 s2

Lungs = 1క్లియర్

ఫిజికల్ యాక్టివిటీ = గుడ్

Next Story