లోకేష్ పాదయాత్రకే ఎందుకు నిబంధనలు!

by Disha Web Desk 16 |
లోకేష్ పాదయాత్రకే ఎందుకు నిబంధనలు!
X
  • పోలీసులు పెట్టిన కండిషన్లు హాస్యాస్పదం ఉన్నాయ్
  • పాదయాత్ర సజావుగా జరగాలన్న కోరిక వారికి లేదు
  • - టీడీపీ నేత వర్లరామయ్య

దిశ,ఏపీ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రకే ఎందుకిన్ని నిబంధనలు పెడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. లోకేష్‌ను చూసి ముఖ్యమంత్రి ఎందుకంతలా వణికిపోతున్నారని ఆయన విమర్శించారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి లోకేష్ పాదయాత్రకు మూడురోజులు అనుమతిస్తూ పెట్టిన కండిషన్లు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. ట్రాఫిక్ రెగ్యులేషన్, క్రౌడ్ కంట్రోల్, శాంతిభద్రతల నిర్వహణ, అంబులెన్సుల ఉపయోగం, ఫైర్ సర్వీస్‌ల వినియోగం అన్నీ పాదయాత్ర నిర్వాహకులే చేస్తే, మరి పోలీసులు, ప్రభుత్వం చేసేదేంటని ప్రశ్నించారు.


గతంలో డీజీగా ఉన్న సాంబశివరావు ఇచ్చిన పర్మిషన్ మాదిరే, పాదయాత్ర మొత్తానికి మీరెందుకు పర్మిషన్ ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. జిల్లా అధికారులకు లోకేష్ పాదయాత్రకు తగురీతిలో భద్రతా ఏర్పాట్లు చేయమని, ఆదేశాలు ఇవ్వాల్సిందిగా డీజీపీని మరో లేఖ ద్వారా కోరుతామని చెప్పారు. చిత్తూరు ఎస్పీకూడా పలమనేరు డీఎస్పీ ఇచ్చిన కండిషన్లతో కూడిన పర్మిషన్‌పై సమీక్షించాలని కోరారు. లోకేశ్ యువగళం పాదయాత్ర సక్రమంగా సజావుగా, జరిగేలా చూడాలన్న ఆలోచన పోలీస్ శాఖకు ఏ కోశానా లేనట్టుందని మండిపడ్డారు, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి, షర్మిల, సీఎం జగన్ పాదయాత్రలు చేసినప్పుడు పోలీస్ శాఖ ఇలానే వ్యవహరించిందా అని వర్ల రామయ్య నిలదీశారు.

Next Story