Guntur: నదీ తీరంలో నాగదేవత విగ్రహాలు.. అశుభం జరుగుతుందేమో!

by Disha Web Desk 16 |
Guntur: నదీ తీరంలో  నాగదేవత విగ్రహాలు..  అశుభం జరుగుతుందేమో!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పూజలందుకోవాల్సిన దేవతా విగ్రహాలు ఒకే చోట కుప్పగా పోయడం సంచలనంగా మారింది. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 50 దేవతా మూర్తు విగ్రహాలు నదీ తీరంలో ప్రత్యక్షం కావడం భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విగ్రహాలు గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో సీతానగరం ప్రకాశం బ్యారేజీ ఎగువభాగాన బయటపడ్డాయి. ప్రకాశం బ్యారేజీ ఎగువభాగాన రాతితో చేసిన నాగదేవత విగ్రహాలు బయటపడటం భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సుమారు 50 నాగదేవత విగ్రహాలను కుప్పగా పోశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ విగ్రహాలను ఇక్కడ కుప్పగా పోసి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. అయితే విగ్రహాలలో కొన్ని దెబ్బతిని ఉన్నాయి. గతంలోనూ ఇలాగే విగ్రహాలు ఇక్కడే కుప్పగా పోశారని స్థానికులు చెప్తున్నారు. ఇలా వదిలి వేయడం వల్ల ఈ ప్రాంతానికి ఏమైనా అశుభం జరుగుతుందేమోనని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విగ్రహాలపై మరో కథనం ఉంది. దేవతామూర్తుల విగ్రహాలు తొలగిస్తే వాటిని నదిలో కలిపే సంప్రదాయం ఉంటుందని, అందులో భాగంగా ఒడ్డున వదిలివెళ్లి ఉంటారని కొందరు చెబున్నారు. అందుకే నదీ తీరంలో వదిలి వెళ్లారని, దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని పలువురు అంటున్నారు.

Next Story

Most Viewed