ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మే 1 తర్వాత వరుస జీవోలు

by Disha Web Desk 16 |
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మే 1 తర్వాత వరుస జీవోలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఉద్యోగులకు మంత్రి బొత్స సత్యనారాయణ ఊరటనిచ్చే ప్రకటన చేశారు. సమస్యలపై ఉద్యోగులతో భేటీ అయిన ఆయన గుడ్ న్యూస్ తెలిపారు. ఉద్యోగుల సమస్యలను వరుసగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. మే 1 నుంచి వరుసగా జీవోలు ఇస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీ కమిటీపై సీఎం జగన్‌తో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఓపీఎస్‌పై తర్వాత సమావేశంలో చర్చిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ‌పైనా చర్చిస్తామన్నారు. అటు సీఎం జగన్ కూడా సానుకూలంగా ఉన్నట్లు మంత్రి బొత్స స్పష్టం చేశారు. త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు.

కాగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు, సమస్యలపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు చాలా రోజులుగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. కొన్నింటికి పరిష్కారం దొరికినా మరికొన్ని పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో పలు మార్లు ఉద్యగ సంఘాల నేతలు నిరసన ప్రకటించారు. ప్రత్యక్షంగా ఆందోళనకు సైతం దిగారు. ఆ సమయంలో వారితో ప్రభుత్వం చర్చలు సైతం జరిపింది. ఉద్యగుల సమస్యలను సీఎం జగన్ దృష్టికీ తీసుకెళ్లారు. అందుకు ఆయన సానుకూలంగా ఉన్నారని మంత్రులు తెలిపారు.

అయితే మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. కార్యాచరణ ప్రకటించారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు జరుపుతున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కూడా ఉద్యోగ సంఘాలతో సమావేశం అయి చర్చించారు. అనంతరం ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పారు. మరి ఇందుకు ఉద్యోగ సంఘాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూాడాలి.



Next Story

Most Viewed