Breaking: చంద్రబాబు నివాసానికి క్యూ కట్టిన నేతలు

by Disha Web Desk 16 |
Breaking: చంద్రబాబు నివాసానికి క్యూ కట్టిన నేతలు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన వేళ గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి ఆ పార్టీ నేతలు క్యూ కట్టారు. తెనాలి ఇంచార్జి అలపాటి రాజాకు సీటు దక్కలేదు. దీంతో చంద్రబాబును కలిశారు. సీటు రాకపోవడంపై ఆయనతో చర్చించి వెళ్లిపోయారు. అనంతరం విశాఖ నార్త్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. తొలి జాబితాలో ఆయన పేరు రాకపోవడంతో ఈ భేటీకి ప్రధాన్యత చోటు చేసుకుంది. అయితే విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి గంటాను చంద్రబాబు పోటీ చేయాలని కోరుతున్నారు. అయితే ఆయన మాత్రం విశాఖ జిల్లా భీమిలి నుంచి పోటీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

అయితే ప్రత్యామ్నాయంగా మాడుగుల, చోడవరం నియోజకవర్గాలను అధినేత చంద్రబాబు పరిశీస్తున్నారు. ఈ విషయంపై చర్చలు కొనసాగుతున్నాయి. భీమిలి నుంచి గంటాకు అవకాశం ఇవ్వడంలేదంటే ఆ స్థానం జనసేనకు వెళ్తోందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీడీపీ నేత వంగవీటీ రాధా కూడా చంద్రబాబును కలిసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నివాసానికి సోమవారం వెళ్తారని తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరే అవకాశం ఉంది. అటు పెనుగొండ మాజీ ఎమ్మెల్యే పార్థసారధి సైతం సోమవారం చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు టీడీపీ అభ్యర్థుల జాబితాలో పార్థసారథికి టికెట్ దక్కలేదు. దీంతో ఆయనకు చంద్రబాబు ఫోన్ చేశారు. సోమవారం తన నివాసానికి రావాలని పిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. మరోవైపు సీట్లు దక్కని వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం పొత్తు తప్పలేదని చంద్రబాబు చెబుతున్నాయి. అయితే చంద్రబాబు పిలుపు కోసం ఇంకా చాలా మంది నేతలు వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది.

Read More..

జనసేన నేత కందుల దుర్గేశ్ తీవ్ర ఆవేదన.. రేపు ఫైనల్ డెసిషెన్


Next Story