రాజ్యసభ పై జగన్ ఫోకస్.. ఆ నలుగురుకే చాన్స్..?

by Web Desk |
రాజ్యసభ పై జగన్ ఫోకస్.. ఆ నలుగురుకే చాన్స్..?
X

దిశ, వెబ్ డెస్క్: రాజ్యసభలో మరో మూడు స్థానాలు వైసీపీ ఖాతాలో పడనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సభ్యుల్లో నలుగురి పదవీ కాలం జూన్ 21 తో ముగుస్తుంది. ఇందులో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లతో పాటు, అప్పటి కేంద్ర మంత్రి సురేష్ ప్రభు స్థానం కూడా ఖాళీ కానుంది. వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్న మరో సీనియర్ నేత విజయ సాయి రెడ్డి పదవీ కాలం కూడా ముగియనుంది. అయితే ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం ఈ నాలుగు స్థానాలు వైసీపీకే దక్కుతాయి.

అయితే మరోసారి విజయ సాయిరెడ్డికి అవకాశం కల్పిస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మిగిలిన మూడు స్థానాలకు గానూ ఒకటి ఉత్తర భారతదేశానికి చెందిన ఒక బడా వ్యాపారవేత్తకు కేటాయిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో రెండు స్థానాలకు గానూ ఒకటి నెల్లూరుకు దక్కనున్నట్టు సమాచారం. నెల్లూరు లో బలమైన వైసీపీ నేతగా పేరున్న బీద మస్తాన్ రావుకు, ఇంకకటి గుంటూరుకు చెందిన మరో సీనియర్ నేతకు ఇస్తారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

బీద మస్తాన్ రావుకు బీసీ కోటాలో దక్కనుంది. అయితే నాలుగు స్థానాలకు గానూ ఒకటి మైనారిటీ/ఎస్సీలకు ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే నలుగురి పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అసంతృప్తుల సెగ తగలకుండా జగన్ ఆచి తూచీ అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.రాజ్యసభ పై జగన్ ఫోకస్.. ఆ నలుగురుకే చాన్స్..?



Next Story

Most Viewed