నేడు అనుచరులతో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు భేటీ.. పయనం ఎటు వైపు..?

by Disha Web Desk 3 |
నేడు అనుచరులతో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు భేటీ.. పయనం ఎటు వైపు..?
X

దిశ డైనమిక్ బ్యూరో: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా చిత్తూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే చిత్తూరులో వైసీపీ తరుపున బలమైన అభ్యర్థిగా విజయనందా రెడ్డిని అధిష్టానం బరిలోకి దింపింది. ఇక టీడీపీ అభ్యర్థిగా గురజాల జగన్ మోహన్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కూడా రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గత కొంతకాలంగా రాజకీయాలకి దూరంగా ఉన్న సీకే బాబు ఈ రోజు తన అనుచరులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎదో ఒక పార్టీకి మాత్రమే మద్దతు ఇస్తారా? లేక ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? అనే అంశంపై స్పష్టత లేదు. దీనితో రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సీకే బాబు చిత్తూరులో ప్రజాదరణ కలిగిన వ్యక్తి.

ఇప్పటికే వరుసగా మూడుసార్లు చిత్తూరు నుండి పోటీ చేసి సీకే బాబు గెలుపొందారు. కాగా 2014 ,2019 ఎన్నికల్లో సీకే బాబు పోటీకి దూరంగా ఉండిపోయారు. అయితే దాదాపు దశాబ్ద కాలం తరువాత రానున్న ఎన్నికల నేపధ్యంలో నేడు తన అనుచరులతో కీలక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీకే బాబు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు.. ఏ పార్టీకి గూటికి చేరనున్నారనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.

Next Story

Most Viewed