Tarakaratnaకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు

by Disha Web Desk 16 |
Tarakaratnaకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు
X

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. జనవరి 26న కుప్పం నారా లోకేశ్ పాదయాత్రలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. అప్పటి నుంచి బెంగళూరు నారాయన హృదయాలయలో చికిత్స పొందారు. దాదాపు 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆయన కొద్దిసేపటిక్రితం మృతి చెందారు. దీంతో ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. మొకిలలోని ఆయన స్వగృహానికి తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్ధం సోమవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచనున్నారు. అదే రోజు సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తారకరత్న కన్నుమూతతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

కాగా తారకరత్న ఎన్డీఆర్ ఐదవ కుమారుడు మోహనకృష్ణ కుమారుడు. ఒకటో నెంబర్ కుర్రాడుతో తెలుగు సినీ పరిశ్రమకు తారకరత్న పరిచయం అయ్యారు. ఆ సినిమాలో నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. విలన్‌గా కూడా తారకరత్న నటించారు. కొద్దిరోజుల క్రితం పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. నారా లోకేశ్ యువగళానికి మద్దతుగా తారకరత్న కూడా పాదయాత్ర చేశారు. అయితే పాదయాత్రలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.



Next Story

Most Viewed