Ap Politics:సీఎం జగన్‌పై మాజీ మంత్రి కొణతాల సంచలన వ్యాఖ్యలు?

by Disha Web Desk 18 |
Ap Politics:సీఎం జగన్‌పై మాజీ మంత్రి కొణతాల సంచలన వ్యాఖ్యలు?
X

దిశ ప్రతినిధి,అనకాపల్లి: ఒక్క ఛాన్స్ అని అధికారం వచ్చాక తల్లిని, చెల్లిని మెడ పట్టుకుని బయటకు గెంటేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. అటువంటి వ్యక్తి ప్రజలను ఇంకా ఏ విధంగా చూసుకుంటాడు. సొంత తల్లినే గెంటేసిన జగన్‌కి సీఎం అయ్యే అర్హత లేదని అన్నారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో తాళ్లపాలెం ఊగినపాలెం గ్రామంలో జరిగిన ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ కూలీలతో బుధవారం జరిగిన సమావేశంలో కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పి ఓట్లు అడిగిన సీఎం నిషేధం చేయలేదు సరి కదా తనే సొంతంగా బినామీ పేర్లతో అధిక ధరలతో సారా వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు.

దొంగ మద్యం వ్యాపారం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది అమాయకులు అనారోగ్యాల పాలై మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. కశింకోట మండలం విస్సన్నపేటలో 600 ఎకరాలు భూ కబ్జా చేసిన మంత్రి గుడివాడ అమర్నాధ్ మీకేం చేశాడో ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఎక్కడ చూసినా భూకబ్జాలు , మైనింగ్ వ్యాపారాలే తప్ప అభివృద్ధి లేదని కొణతాల అన్నారు. ఈ సమావేశంలో మండల స్థాయి నాయకులు పలువురు ఉపాధి హామీ కూలి పనికి వచ్చిన ఆడవారు మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు వారి సమస్యలను తెలుసుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా గ్రామ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణను కోరారు.

రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పుడు మీరు చేస్తున్న పనికి ఆహార పథకం (ఎన్ఆర్ఈజీఎస్) పథకంలో భాగంగా ప్రస్తుతం ఏదైతే 300 రూపాయలు మీకు అందుతుందో దానికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 400 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీ ఆడపిల్లల పెళ్లి సమయంలో లక్ష రూపాయలు పెళ్లి కానుకగా ఇవ్వబడునని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు జిల్లా మొత్తం ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని,వంటింటి మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని తెలియజేశారు. గాజు గ్లాసు గుర్తుపై అలాగే కమలం గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



Next Story