- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
ట్రైన్లలో చోరీలు.. తునిలో యువకుడి అరెస్ట్
by Disha Web |

X
దిశ, తుని: ట్రైన్లలో చోరీలకు పాల్పడుతున్న యువకుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. తుని మండలం కొలిమేరు గ్రామానికి చెందిన శ్రీమంతుల నాగబాబు చెడు వ్యసనాలకు అలవాటు పడి, ఈజీ మనీ కోసం ట్రైన్లలో ఛార్జింగ్ పెట్టిన ఫోన్లు, లాప్ టాప్‌లు దొంగతనాలకు పాల్పడుతున్నాడని రైల్వే ఎస్సై అబ్దుల్ మారుప్ తెలిపారు. ఈ ఫోన్లు, లాప్ టాప్‌లు తక్కువ ధరకి మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటారన్నారు. తక్కువ ధరలకు విక్రయిస్తున్న ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువకులు ఈజీ మనీకి అలవాటు పడి వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అబ్దుల్ మారుప్ వివరించారు.
Next Story