Breaking: ఉండవల్లితో షర్మిల భేటీ.. కీలక ప్రకటన

by Disha Web Desk 16 |
Breaking: ఉండవల్లితో షర్మిల భేటీ.. కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. పాత కొత్త, నేతలను కలుస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుత రాజకీయాలపై అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలను కలిసిన ఆమె తాజాగా మాజీ ఎంపీ, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ చేరాలని కోరినట్లు తెలుస్తోంది. అటు రాజకీయాలపైనా ఇరువురు చర్చించినట్లు సమాచారం. వైఎస్ ఫ్యామిలీతో ఉండవల్లికి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఉండవల్లిని కలిసి రాజకీయ సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ భేటీ తర్వాత వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఉండవల్లితో భేటీపై క్లారిటీ ఇచ్చారు. ఉండవల్లి మర్యాదపూర్వకంగా కలిశానని, రాజకీయా ప్రాధాన్యత లేదని తెలిపారు. తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహిత సంబంధాలున్న నేతలను తాను కలుస్తున్నానని చెప్పారు.

ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ షర్మిలకు తన ఆశీస్సులు, సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. షర్మిలతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో షర్మిల ప్రణాళికలు సిద్దం చేసుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ మాత్రమే పరిపాలనను సమర్థవంతంగా చేయగలదన్నారు. వైఎస్ ఆశయాలకనుగుణంగా షర్మిల నడుచుకుంటారని ఉండవల్లి తెలిపారు. ఏడేళ్ల క్రితం జగన్ కూడా తనను కలిశారని చెప్పారు. కుటుంబ బాంధవ్యాలు వేరని.. రాజకీయాలు వేరని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.

Next Story