ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమాకు తప్పని నిరాశ.. హైకోర్టులో విచారణ వాయిదా

by Shiva |
ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమాకు తప్పని నిరాశ.. హైకోర్టులో విచారణ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతూ.. నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ‘వ్యూహం’ ట్రైలర్‌ విడుదల సందర్భంగా దర్శకుడు ఆర్జీవీ తనకు జగన్‌ అంటే ఇష్టమని, చంద్రబాబు, పవన్‌ ఏ మాత్రం ఇష్టం లేదంటూ చెప్పినట్లుగా లోకేశ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఎం జగన్‌ ఆర్జీవీ వెనకు ఉండి సినమా తీయించారని ఆరోపించారు. అదేవిధంగా పిటిషన్‌లో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ ఆఫీస్, రివైజింగ్‌ కమిటీ, రామధూత క్రియేషన్స్‌, నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌, దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను పిటిషన్‌లో ప్రతివాదులుగా చేరుస్తూ లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed