ఓటర్ల జాబితా లో అనర్హుల పేర్లు తొలగింపు.. ఎంతమందిని తొలిగించారంటే..?

by Disha Web Desk 3 |
ఓటర్ల జాబితా లో  అనర్హుల పేర్లు తొలగింపు.. ఎంతమందిని తొలిగించారంటే..?
X

దిశ వెబ్ డెస్క్: ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని పలు పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం సుపరిచితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిర్యాదులపై దృష్టి సారించింది. దీనితో ఓటర్ల జాబితా గుట్టు బయటపడింది. అర్హత లేని లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుండి రాష్ట్ర ఎన్నికల సంఘం తొలిగించింది. ఈ విషయం పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా మాట్లాడుతూ.. 14.48 లక్షల మంది అనర్హుల పేర్లు జాబితాలో ఉన్నాయని.. వివిధ పార్టీల నుండి ఫిర్యాదులు వచ్చిన మేరకు వాటిని పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఓటర్ల జాబితాలో 5 లక్షల 64 వేల 819 మంది అనర్హత కలిగి ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. అనంతరం అనర్హులైన వాళ్ళ పేర్లను జాబితా నుండి తొలిగించామని తెలిపారు. కాగా రాష్ట్రం లోని ఓటర్ల జాబితాలో విస్తారంగా అవకతవకలు చోటు చేసుకున్నాయని తెలుగుదేశం అధినేత ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి తీసుకున్న చర్యలను వివరిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా సోమవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు లేఖ రాశారని.. ఈ క్రమంలో ప్రత్యేక సమగ్ర సవరణ-2024 ప్రక్రియలో భాగంగా వచ్చిన 17,976 దరఖాస్తులు మినహా మిగతావన్నీ పరిష్కరించామని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed