డేటా చౌర్యం టీడీపీకే అలవాటు : మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన

by Disha Web Desk 21 |
డేటా చౌర్యం టీడీపీకే అలవాటు : మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓటర్ల జాబితా సవరణలో అవకతవకలు జరిగాయంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఖండించారు.ఓటర్ల జాబితాలో అవకతవకలపై టీడీపీ నేతలు గగ్గోలు పెడుతుంటే దొంగే దొంగా..దొంగా..! అన్నట్లు ఉందని ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం, ఓటర్ల జాబితాలను తారుమారు చేయడం టీడీపీకి అలవాటని ఓ ప్రకటనలో బుధవారం వెల్లడించారు.‘సేవా మిత్ర ’యాప్ ఉపయోగించి 2017లో ఆ పార్టీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, లక్షల మంది ఓట్లను తొలగించి, పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. సేవామిత్ర యాప్‌ ద్వారా టీడీపీ అక్రమాలకు పాల్పడిందనేదానిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు కూడా విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా ఆ పార్టీయే మరోసారి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ, మొబైల్‌కు వచ్చే ఓటీపీలను సైతం అడుగుతున్నారని.. ఇవ్వకపోతే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. బోగస్ ఓట్లు, దొంగ ఓట్ల సంస్కృతి టీడీపీ వారిదేనని...ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నదే తమ అభిమతమని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed