తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

by Disha Web Desk 1 |
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : కలియుగ దైవం వేంకటేశ్వరుడి దివ్య సన్నధి తిరుమలో ఇవాళ భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వారంతం కావడంతో అనుకున్నట్లుగా పెద్దగా రష్ ఏమీ లేదు. నిన్న స్వామి వారిని 68,793 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 26,489 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కేవలం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వ దర్శనం క్యూ లైన్‌లో టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతోంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు గంటల్లో స్వామి వారి దర్శనం పూర్తి అవుతోంది.

Next Story

Most Viewed