Deputy Cm: చెత్త నుంచి సంపద సృష్టి

by Disha Web Desk 16 |
Deputy Cm: చెత్త నుంచి సంపద సృష్టి
X

దిశ, దేవరాపల్లి: భారత ప్రభుత్వ జల శక్తి, తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రాల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి బూడి ముత్యాలనాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్యాలనాయుడు మాట్లాడుతూ సుస్థిర, సమర్ధవంతమైన ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ, పరిశుభ్రతకు 4,729 గ్రామాలను ప్రకటించామన్నారు. చెత్త నుండి సంపదలో భాగంగా గ్రామాల్లో 10,499 షెడ్ల నుంచి 81.1 శాతం ఘనవ్యర్ధాల నిర్వహణ, చెత్త సేకరణ వాహనాల ద్వారా జరుతుందన్నారు. అదే విధంగా మరుగు నీటి శుద్ధి కోసం తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను అవలంబించడానికి గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. 607 ప్రాంతాల్లో మరుగు నీటి శుద్ధి యూనిట్లు ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 83.62 కోట్లు మంజూరు చేయగా త్వరలోనే వాటి పనులు ప్రారంభించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

ఏప్రిల్ 2022 నుంచి ఇప్పటివరకు SNA ఖాతా నుంచి రూ. 123.99 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా రూ. 83.34 కోట్లు బ్యాలెన్స్ అందుబాటులో ఉందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు వెల్లడించారు. . గ్రామీణ పారిశుధ్యం కోసం 15వ ఆర్థిక సంఘం, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం రూ.1163.40 కోట్ల నిధులు విడుదల చేయగా అందులో 80 శాతం నిధులు వినియోగించామని స్పష్టం చేశారు. జిల్లా, మండల పరిషత్, గ్రామపంచాయతీలకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు తెరిచి వాటిని పీఎఫ్ఎమ్మెస్ విధానం ద్వారా నిధులు చెల్లింపులు జరిగేలా చూస్తున్నామని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు.



Next Story

Most Viewed