- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈనెల 30న సీఎం వైఎస్ జగన్ రాయలసీమ పర్యటన
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల పర్యటన ఖరారైంది. నంద్యాలలో అవుకు రెండవ టన్నెల్‌ను సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం అక్కడ నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా వెళ్లనున్నారు. కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని సీఎంవో తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ సైతం ఖారు చేసింది. ఈనెల 30న ఉదయం 10 గంటలకు సీఎం వైఎస జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి అవుకు రెండవ టన్నెల్ సైట్‌కు చేరుకుని నీటిని విడుదల చేసి రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అక్కడి నుంచి కడప చేరుకుని పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లిలోని నివాసనికి చేరుకుంటారని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.