వాలంటీర్లకు గుడ్ న్యూస్.. సీఎం జగన్ ఎన్నికల హామీ ఇదే..!

by Disha Web Desk 16 |
వాలంటీర్లకు గుడ్ న్యూస్.. సీఎం జగన్ ఎన్నికల హామీ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల విధులు, పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లు దూరమయ్యారు. పింఛన్‌దారులకు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతవులు, డయాలిసిస్ పేషెంట్లు గ్రామ సచివాలయాలకు వెళ్లి పెన్షన్లు తీసుకుంటున్నారు. అయితే వాలంటీర్ల ఇష్యూ అధికార, ప్రతి పక్ష నేతల మధ్య మాటలయుద్ధానికి దారి తీసింది. మరోవైపు రాష్ట్రంలో పలువురు వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్ తెలిపారు. చిత్తూరు జిల్లా నాయుడుపేటలో సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ జూన్ 4 తర్వాత రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని, వాలంటీర్ల వ్యవస్థపైనే తాను తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఇప్పుడున్న పథకాలన్నీ అమలు చేస్తామన్నారు. మేనిఫెస్టోలో పెట్టినా.. పెట్టకపోయినా సాధ్యమైనన్ని పథకాలు ఇంటింటికీ అందజేస్తామని సీఎం చెప్పారు.


చంద్రబాబు మాదిరి తాను మోసపూరితమైన హామీలు, అబద్ధాలు చెప్పనని సీఎం జగన్ చెప్పారు. 2014 ఎన్నికల్లో హామీలు అంటూ ముగ్గులు ఫొటోలు, సంతకాలతో ప్రతి ఇంటికీ కరపత్రాలు పంపిణీ చేశారని విమర్శించారు. రైతులకు రుణమాఫీ, చంద్రబాబువన్నీ వెన్నుపోట్లు, కుట్రలు, మోసాలు, కుతంత్రాలేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు తన అనే వాళ్లంతా నాన్ లోకల్ అని సెటైర్లు వేశారు. పొత్తులు, జిత్తులతో పని లేకుండా ఇంటింటికీ మంచి చేశామని చెప్పారు. చంద్రబాబు కిచిడీ మేనిఫెస్టోతో తాను పోటీ పడదల్చుకోలేదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.



Next Story

Most Viewed