Kuppam: ఆపరేషన్ గజ సక్సెస్!

by Disha Web Desk 16 |
Kuppam: ఆపరేషన్ గజ సక్సెస్!
X

దిశ, కుప్పం: ఆంధ్ర - తమిళనాడులో ప్రజల ప్రాణాలు తీస్తున్న మదపుటేనుగులను అదుపు చేసేందుకు శిక్షణ పొందిన మూడు ఏనుగులు రంగంలోకి దిగాయి. తమిళనాడు రాష్ట్రం ఊటీ నుంచి మూడు ట్రైనీ ఏనుగులు చిన్నతంబి, లేచి, విల్సన్‌ను అటవీశాఖ తిరుపత్తూరు తీసుకు వచ్చారు. అనంతరం ఊటీకి చెందిన అటవీ అధికారి రాజేష్ నేతృత్వంలో అన్నామలై రిజర్వ్ ఫారెస్ట్ బృందంచే ఆపరేషన్ గజకు శ్రీకారం చుట్టారు.

రెండు మధుపుటేనుగులకు మత్తుమందు ఇచ్చి అటవీ సిబ్బంది బంధించారు. అటవీ ప్రాంతంలో మత్తులో పడి ఉన్న ఏనుగులను ట్రైనీ ఏనుగుల సాయంతో వాటిని బంధించారు. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరిలో నలుగురిని తొక్కి చంపి.. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఇద్దరు ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. కుప్పం సరిహద్దులోని తిరుపత్తూరు జిల్లా నాట్రంపల్లి జోలార్ పేట పరిసర ప్రాంతాల్లో వారం రోజులుగా మదపుటేనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ఆపరేషన్ గజ‌కు తీశారు.



Next Story

Most Viewed