Nara lokeshకు 200 మంది ప్రైవేటు బౌన్సర్లు - అనుక్షణం 400 మంది వాలంటీర్లు..!

by Disha Web Desk 16 |
Nara lokeshకు 200 మంది ప్రైవేటు బౌన్సర్లు - అనుక్షణం 400 మంది వాలంటీర్లు..!
X

దిశ, తిరుపతి: నారా లోకేశ్ పాదయాత్ర వేళ 200 మంది బౌన్సర్లను భద్రత కోసం పని చేస్తున్నారు. 400 మంది వాలంటీర్లు లోకేశ్‌ను అనుసరిస్తున్నారు. నారా లోకేశ్ పాదయాత్ర తొలి రోజు అట్టహాసంగా కొనసాగింది. కుప్పం నుంచి లోకేశ్ పాదయాత్రఇచ్ఛాపురం వరకు కొనసాగనుంది. దాదాపు 400 మంది వాలంటీర్లు లోకేశ్‌ను అనుసరిస్తున్నారు. పాదయాత్ర జరుగుతున్న సమయంలో లోకేశ్ కోసం ప్రత్యేకంగా ఒక క్యారవాన్ ఏర్పాటు చేశారు. రోజూ యాత్ర ప్రారంభం.. ముగిసిన తరువాత పార్టీ నేతలతో ఆ రోజు కార్యక్రమాలు.. ప్రణాళికలపై పార్టీ నేతలతో చర్చించేందుకు వీలుగా క్యారవాన్‌లో చిన్న సమావేశాల నిర్వహణకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. అదే సమయంలో రూట్ మ్యాప్‌కు అనుగుణంగా జిల్లాల పోలీసు అధికారులు ఎక్కడికి అక్కడ లోకేశ్ యాత్రకు బందో బస్తు కల్పించనున్నారు. రాజకీయంగా సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించిన చోట ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. లోకేశ్ యాత్రలో రోడ్ షో లు.. సభలకు సంబంధించి జిల్లా స్థాయిలోనే అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు.

కాగా లోకేశ్ పాదయాత్ర జరగనున్న 400 రోజులు ఆయన వెంట 400 మంది వాలంటీర్లు ఫాలో అవుతారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఎంపిక చేసిన వారిని వాలంటీర్లుగా నియమించారు. వీరు రోజూ యాత్ర ముగిసిన తరువాత లోకేశ్ బస చేసే ప్రాంతంలో ప్రత్యేకంగా జర్మన్ షెడ్లు వేసి మంచాలను అందుబాటులో ఉంచారు. అక్కడే వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా ఎటువంటి లోటు రాకుండా వారిని స్థానిక నాయకత్వం చూసుకోనుంది. వారి బాధ్యతలను అన్ని జిల్లాల్లో తెలుగు యువత నాయకత్వానికి అప్పగించారు. లోకేశ్ యాత్రతో కొనసాగటంతో పాటుగా రాకీయంగా ఏమైనా అనుకోని ఘటనలు ఎదురైన సమయంలో వీరు లోకేశ్‌కు రక్షణగా నిలుస్తారు.

Next Story

Most Viewed