పెద్దమ్మతో కలిసి అమిత్ షాను కలిసిన చినబాబు: పురంధేశ్వరి వివరణ ఇదే!

by Disha Web Desk 21 |
పెద్దమ్మతో కలిసి అమిత్ షాను కలిసిన చినబాబు: పురంధేశ్వరి వివరణ ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో కలిసి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవ్వడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు ఏపీలో జగన్ ప్రభుత్వం, ఇతర కీలక నేతల కక్షసాధింపు రాజకీయాలపై లోకేశ్ హోం మంత్రికి వివరించినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందంటూ వస్తున్న ఆరోపణలను దగ్గుబాటి పురంధేశ్వరి ఖండించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ ఉంటే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చి ఉండేవారా? అని దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు. బీజేపీ కేవలం ఏపీలో జనసేనతో మాత్రమే పొత్తులో ఉందని తెలిపారు. అలాగే చంద్రబాబుకు మద్దతుగా ఉన్నట్లు వస్తున్న ఆరోపణలను సైతం పురంధేశ్వరి ఖండించారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని పురంధేశ్వరి వెల్లడించారు.


నీపై ఎన్నికేసులు పెట్టారు?: లోకేశ్‌తో అమిత్ షా

ఇకపోతే బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ అయ్యారు. జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లారు. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్న జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టికి లోకేశ్ తీసుకెళ్లారు. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు పై ఎన్ని కేసులు పెట్టారు? నీ పై ఎన్ని కేసులు పెట్టారు అని లోకేశ్‌ని అడిగిన అమిత్ షా. కక్ష సాధింపు తో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్రైల్ కోర్టు, హై కోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి అమిత్ షాకి నారా లోకేశ్ వివరించారు. 73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని అమిత్ షా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్న అమిత్ షా. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నాను అని లోకేశ్‌తో అమిత్ షా అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed