ఓపెన్‌గా మద్దతిచ్చిన పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు: చంద్రబాబు

by Disha Web Desk 2 |
ఓపెన్‌గా మద్దతిచ్చిన పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు: చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై చంద్రబాబు విడుదల అయ్యారు. 52 రోజుల తర్వాత జైలు నుంచి చంద్రబాబు బయటకొచ్చారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆపత్కాలంలో నా కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ కార్యకర్తలను కంటికి రెప్పాలా కాపాడుకుంటానని ఎమోషనల్ అయ్యారు. ‘మీరు చూపించిన అభిమానం నేను మరిచిపోను. నేను తప్పుచేయను, చేయనివ్వను. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓపెన్‌గా వచ్చి మద్దతు నిలిచారు. నాకు మద్దతు తెలిపిన పవన్‌కు, జనసైనికులకు ధన్యవాదాలు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఏ తప్పు చేయలేదు. చేయబోను’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగా, చంద్రబాబు విడుదల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున చేరుకోవడంతో రాజమండ్రి జైలు వద్ద కోలాహలం నెలకొంది.

Read More..

ఉండవల్లికి బయలుదేరిన చంద్రబాబు: భారీ కాన్వాయ్‌తో పయనం

Next Story