బీసీల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాపాడారు: మాజీమంత్రి కొల్లు రవీంద్ర

by Disha Web Desk 7 |
బీసీల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాపాడారు: మాజీమంత్రి కొల్లు రవీంద్ర
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు చేసిన కృషి అభినందనీయమని మాజీమంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీసీ మహిళను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడమే కాకుండా ఆమెను గెలిపించేందుకు అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ మహిళా అనురాధను ఓడించడానికి సైకో ముఖ్యమంత్రి ఎన్ని అడ్డదారులు తొక్కలో అన్ని అడ్డదారులు తొక్కారని అయినప్పటికీ చంద్రబాబు బెదరలేదని చెప్పుకొచ్చారు.

తెలుగుదేశం పార్టీకి టెక్నికల్‌గా 23 మంది సభ్యులు ఉన్నపటికీ 4గురు ఎమ్మెల్యే లను తనవైపు తిప్పుకుని ఈ ఎన్నికల్లో వారు తెలుగుదేశానికి ఓటు వేయకుండా చేశారని విమర్శించారు. అంతేకాదు బీసీ మహిళా పంచుమర్తి అనురాధకు ఎవరు ఓటు వేయకూడదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను సైతం భయపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎవరు ఎన్ని అనైతిక చర్యలు చేపట్టినా చంద్రబాబు మాత్రం పంచుమర్తి అనురాధ గెలుపు కోసం ముందుకు వెళ్లారని చెప్పుకొచ్చారు. బీసీల ఆత్మగౌరవాన్ని నాడు ఎన్టీఆర్ పెంచితే నేడు చంద్రబాబు మరింత పెంచారని కొనియాడారు.

ఈ మేరకు చంద్రబాబు ఫోటోకు కొల్లు రవీంద్ర నేతృత్వంలోని టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. మరోవైపు పంచుమర్తి అనురాధ అతి చిన్న వయసులోనే విజయవాడ మేయర్‌గా సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్నారు అని కొనియాడారు. బీసీల కోసం అనేక పోరాటాలు చేశారని.. పార్టీకి ఎంతో అండగా నిలిచారన్నారు. దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు ఆమెపై సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు మార్ఫింగ్ చేసి, వ్యక్తిగత జీవితాన్ని దూషిస్తూ పోస్టులు పెట్టి మానసికంగా దెబ్బతీయాలని చూశారని కొల్లు రవీంద్ర ఆరోపించారు.

Next Story