Viveka Case: ప్రత్యక్ష సాక్షి ఇనాయతుల్లాను విచారిస్తున్న సీబీఐ

by Disha Web Desk 16 |
Viveka Case: ప్రత్యక్ష సాక్షి ఇనాయతుల్లాను విచారిస్తున్న సీబీఐ
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు వేగం పెంచారు. వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లా ఈ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. వివేకానందారెడ్డి హత్య తర్వాత ఆయన మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చారు. గతంలోనే ఇనాయతుల్లాను పులివెందులలో ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఇనాయతుల్లాతో పాటు ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి ప్రకాశ్ రెడ్డిని హైదరాబాద్‌లో మరోసారి ప్రశ్నిస్తున్నారు వీరి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అయితే ఉదయ్ కుమార్ రెడ్డి గతంలో యురేనియం కంపెనీలో పని చేశారు. ఆ సమయంలో ఉదయ్ కుమార్‌తో సన్నిహితంగా ఉన్న రాజు, చంద్రశేఖర్, వెంకట రాజేశ్‌ను కూడా విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఇప్పటికే ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ పొడిగింపు

కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డికి సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. మరో 14 రోజులపాటు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్యకేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ బుధవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడిని నాంపల్లిలోని సీబీఐ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆయన రిమాండ్‌ను పొడిగిస్తూ సీబీఐ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే వైఎస్ వివేకా హత్యకు సంబంధించి కీలకమైన సాక్షాలను తారుమారు చేశారనే అభియోగాలు ఉదయ్ కుమార్ రెడ్డిపై ఉన్నాయి.

ఇవి కూడా చదవండి : Viveka Case: ఉదయ్ కుమార్‌ రిమాండ్ పొడిగింపు

Next Story