Breaking: వైఎస్ వారసత్వం తీసుకుంటే సరిపోదు.. ప్రాజెక్టులు పూర్తి చేయాలి కదా: జగన్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
Breaking: వైఎస్ వారసత్వం తీసుకుంటే సరిపోదు.. ప్రాజెక్టులు పూర్తి చేయాలి కదా: జగన్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ వారసత్వం తీసుకుంటే సరిపోదు.. రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తి చేయాలి కదా అంటూ ప్రధాని మోడీ, సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అనకాపల్లిలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. బీజేపీ హయాంలో భారత్‌కు ప్రపంచంలో ఖ్యాతి పెరిగిందని తెలిపారు. వికసిత్ భారత్ కోసం ఎన్డీఏ కూటమికి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. తన పనితీరును చూసే దేశ ప్రజలకు తమ పార్టీకి ఓటు వేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో 9 వేల కి.మీ మేర హైవేలు నిర్మిస్తున్నామని గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్రానికి ట్రిపుల్ ఐటీ, ఐఐటీ కూడా మంజూరు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఇంత అభివృద్ధి చేస్తుంటే.. వైసీపీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

వైఎస్ వారసత్వం తీసుకుంటే సరిపోదని.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలి కదా అని ప్రధాని ఫైర్ అయ్యారు. నేడు రాష్ట్రంలో అవినీతి తప్పా.. ఇంకేమి వినిపించడం లేదని విమర్శించారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు భూమి ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రం పేదల కోసం 24 లక్షల ఇండ్లు మంజూరు చేసిందని.. కానీ, వైసీపీ అందులో సగం కూడా పేదకుల ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వ విధానాలతో ఇప్పటికే చెరుకు రైతులు కుదేలయ్యారని, డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చాక చెరుకు రైతుల జీవితాల్లో మాధుర్యం తెస్తామని అన్నారు. కాంగ్రెస్, వైసీపీ పార్టీలది ఒకటే దారని.. మాఫియా రాజ్ అంటూ ప్రధాని మండిపడ్డారు. ఏపీలో ఇసుక, లిక్కర్ మాఫియా నడుస్తోందని, కాంగ్రెస్, వైసీపీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందంటూ ప్రధాని మోడి ధ్వజమెత్తారు.

Read More..

BREAKING: ప్రభుత్వ పథకాలకు బ్రేక్.. సర్కార్ రిక్వెస్ట్‌కు ఈసీ రెడ్ సిగ్నల్

Next Story

Most Viewed