లోకేశ్ యువగళం పాదయాత్రకు బ్రేక్!ఎందుకంటే?

by Disha Web Desk 21 |
లోకేశ్ యువగళం పాదయాత్రకు బ్రేక్!ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు లోకేశ్ యువగళం పాదయాత్రకు విరామం పలికారు. అనంతరం చంద్రబాబు నాయుడు కేసులు, పార్టీ వ్యవహారాలతో లోకేశ్ బిజీబిజీగా గడుపుతున్నారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు ఢిల్లీలో న్యాయ నిపుణులతో వరుస భేటీలు అవుతున్నారు. మరోవైపు తన తండ్రి అక్రమ అరెస్ట్‌కు జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే తరుణంలో ఇటీవల టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీకి నారా లోకేశ్ వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 29 రాత్రి 8:15 గంటలకు యువగళం పాదయాత్ర ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ప్రారంభించాలని లోకేశ్ నిర్ణయించారు. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి తిరిగి యువగళం పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే అక్టోబర్ 3న సుప్రీంకోర్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో లోకేశ్ తన యువగళం పాదయాత్రను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పాదయాత్రకు సంబంధించి మరో తేదీని ప్రకటిస్తామని లోకేశ్ వెల్లడించారు.


Next Story

Most Viewed