మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం : మంత్రి బొత్స సత్యనారాయణ

by Web Desk |
మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం :  మంత్రి బొత్స సత్యనారాయణ
X

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఉన్నది చట్టాలు చేసేందుకేనని చెప్పుకొచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో భేటీకి ముందు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తీర్పుపై చర్చిస్తామని చెప్పుకొచ్చారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏం చెప్పిందో న్యాయ నిపుణులతో చర్చిస్తామని వెల్లడించారు.

అసెంబ్లీ, పార్లమెంటు ఉన్నదే చట్టాలు చేయడానికి అని.. ఇది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పుకొచ్చారు. మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఒక్కరాజధాని ఉంటే అభివృద్ధి ఒక ప్రాంతానికే పరిమితమై ఉంటుందని అందువల్ల వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని తమ ప్రభుత్వం బలంగా నమ్ముతుందన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం.. భావితరాలకు మంచి చేయాలనే ఒక చక్కటి ఉద్దేశంతో తాము మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు కేవలం తన సామాజిక వర్గం కోసం ఆలోచిస్తున్నారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు.

Next Story

Most Viewed