AP Political News: అంగన్వాడీల అంశంపై స్పందించిన బొత్స..ఏమ్మన్నారంటే..?

by Disha Web Desk 3 |
AP Political News: అంగన్వాడీల అంశంపై స్పందించిన బొత్స..ఏమ్మన్నారంటే..?
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు సమ్మె చేపట్టిన విషయం అందరికి సుపరిచితమే. అయితే సమ్మె చేపట్టి నెల రోజులు దాటుతున్న నేటికీ సమ్మె కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా నిన్న అంగన్వాడీలు చేపట్టిన సమ్మెపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా విడుదలైన పత్రిక ప్రకటన ఇలా ఉంది. ఇప్పటీ పలు జిల్లాల్లో అంగన్వాడీలు సమ్మె విరమించుకుని విధులకు హాజరవుతున్నారని.. ఇక మరో రెండు మూడు జిల్లాల్లో సమ్మె చేస్తున్న అందరు అంగన్వాడీలు సమ్మెను విరమించుకుని ఎదావిధిగా విధుల్లో చేరారని తెలిపారు. అలానే మిగిలిన అన్ని జిల్లాల్లో అంగన్వాడీలు కూడా విధులకు హాజరవుతున్నారని పేర్కొన్నారు.

ఇలా సమ్మె విరమించుకుని విధుల్లో జాయిన్ అవుతున్న అంగన్వాడీలకు రాష్ట్రప్రభుత్వం తరుపున ధన్యవాదాలు తెలియచేసిన బొత్స.. ఈ ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం అని మరోసారి గుర్తుచేస్తున్నానని పేర్కొన్నారు. ఇక మిగిలిన వారు కూడా విధులకు హాజరు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీల జీతం పెంచామని.. అంగన్వాడీలు అడగకపోయిన అనేక సౌకర్యాలు, సదుపాయాలు కలిపించామని వెల్లడించారు.

ఇక ప్రస్తుతం అంగన్వాడీలు కోరిన అనేక డిమాండ్లను రాష్ట్రప్రభుత్వం అంగీకరించడమే కాకుండా వాటిని అమలు లోకి తెచ్చేలా ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసిందని తెలిపారు. మిగిలిన డిమాండ్ల పై సానుకూలంగా ఉన్నట్లు తెలిపిన ఆయన రానున్న ఆర్ధిక సంవత్సరంలో ఆ డిమాండ్లను కూడా పరిష్కరిస్తామని తెలిపారు. దయచేసి రాజకీయ శక్తుల చేతుల్లో ఆటబొమ్మలుగా మారొద్దని అంగన్వాడీలను కోరారు.



Next Story

Most Viewed