బీఏసీ సమావేశం: ఈనెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు

by Disha Web Desk 21 |
బీఏసీ సమావేశం: ఈనెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 27 వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ సభ్యులు హాజరుకాలేదు. ఈ బీఏసీ సమావేశానికి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా టీడీపీ సభ్యులు సమావేశానికి గైర్హాజరయ్యారు. అయితే ఈ బీఏసీ సమావేశానికి సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,చీఫ్ విప్ ప్రసాదరాజు, మంత్రులు జోగి రమేశ్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ నెల 23, 24 తేదీల్లో ఏపీ అసెంబ్లీకి సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈనెల 22న ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై చర్చించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి రోజూ రెండు అంశాలపై చర్చించాలని బీఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ సెషన్‌లో 8 అంశాలపై అసెంబ్లీలో చర్చించాలని బీఏసీ నిర్ణయించింది.



Next Story

Most Viewed