10వ తరగతి ఫలితాలు ఎప్పుడంటే.. పూర్తి వివరాలివే

by Vinod kumar |
10వ తరగతి ఫలితాలు ఎప్పుడంటే.. పూర్తి వివరాలివే
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ 10వ తరగతి పరీక్షల ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్టు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి. దేవానందరెడ్డి వెల్లడించారు. ఈనెల 18వ తేదీతో 10వ తరగతి పరీక్షలు ముగుస్తున్నాయన్నారు. 19 నుంచి 26వ తేదీ వరకు 8 రోజుల పాటు రాష్ట్రంలోని 23 జిల్లాల్లో స్పాట్‌ వాల్యుయేషన్ జరుగుతుందని తెలిపారు.

ఇందులో 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొంటారని చెప్పారు. వాల్యుయేషన్ అనంతరం కార్యక్రమాలు పూర్తి చేసి మే రెండో వారంలో విద్యాశాఖ మంత్రి అనుమతితో 10వ తరగతి ఫలితాలు విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.

Also Read...

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు..?

Next Story

Most Viewed