వేడెక్కిన ఏపీ రాజకీయం..టీడీపీ మినీ మేనిఫెస్టోలోని 6 అంశాలు ఇవే

by Disha Web Desk 21 |
వేడెక్కిన ఏపీ రాజకీయం..టీడీపీ మినీ మేనిఫెస్టోలోని 6 అంశాలు ఇవే
X

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ వచ్చే ఎన్నికలకు మినీ మేనిఫెస్టో విడదుల చేయడంతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల ఏడాదిలో మేనిఫెస్టో మంటలు పీక్స్‌కు వెళుతున్నాయి. అధికార వైసీపీ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే టీడీపీ ప్రకటించిన ఆరు హామీలు ప్రజలను మెప్పిప్తాయని ఆ పార్టీ వర్గాల్లో ధీమా వ్యక్తమవుతోంది. అయితే అధికార వైసీపీ పార్టీ మాత్రం మేనిఫెస్టోలోని అంశాలపై విరుచుకుపడుతోంది. ఆ పార్టీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గతంలో హామీల సంగతేంటని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. అంతేకాదు చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పలువురు నేతలు కౌంటర్ ఇచ్చారు.

టీడీపీ మినీ మేనిఫెస్టోలోని 6 అంశాలు ఇవే:

1.ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద మహిళలకు ప్రతినెలా రూ. 1500.

2. చదువుకుంటున్న పిల్లల తల్లులకి ఏడాదికి రూ. 15000.

3. జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.

4. ప్రతి కుటుంబానికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం

5. రైతన్నకు ఏడాదికి రూ. 20,000 ఆర్థిక సాయం

6. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3000 భృతి



Next Story

Most Viewed