AP Govt: 50 వేల మంది పేదలకు గుడ్‌న్యూస్.. 26నే ఇళ్ల పట్టాల పంపిణీ

by Disha Web Desk 16 |
AP Govt: 50 వేల మంది పేదలకు గుడ్‌న్యూస్.. 26నే ఇళ్ల పట్టాల పంపిణీ
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి ఆర్5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ నెల 26న అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు 50 వేల మంది లబ్ధిదారులకు పట్టాలు అందించేందుకు రెడీ అవుతోంది. సీఎం జగన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నారు.

కాగా ఆర్ 5 జోన్‌లో విజయవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు రాజధాని కోసం ఇచ్చిన భూముల్లో 5 శాతం స్థలాలను పంపిణీ చేసేందుకు 50 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఒక్కో లబ్ధిదారుడికి సెంటు చొప్పున ఈ స్థలాల్లో హద్దులు వేసింది.

అయితే రాజధాని ప్రాంత రైతులు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండు కోర్టులు కూడా ఆర్5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది..

Also Read..

టెన్త్‌లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు లక్ష రూపాయలు అందిస్తాం: మంత్రి బొత్స



Next Story