AP అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ స్పీచ్‌లో ఇవే హైలెట్స్

by Disha Web Desk 2 |
AP అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ స్పీచ్‌లో ఇవే హైలెట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభయ్యాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసిందని అన్నారు. తమది పేదల ప్రభుత్వం అని తెలిపారు. అణగారిన వర్గాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాలు తమ ప్రభుత్వంలో లబ్దిపొందాయని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో పేదరికాన్ని 11.25 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గించామని వెల్లడించారు. విద్యారంగానికి రూ.73 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.

దీంతో జగనన్న గోరుముద్ద పథకం ద్వారా 43.26 లక్షల విద్యార్థులు లబ్ధిపొందారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు, ప్రభుత్వ స్కూళ్లలో గ్లోబల్ ఎడ్యూకేషన్ అందిస్తున్నట్లు తెలిపారు. మొత్తం ఇప్పటివరకు నాలుగు సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టామని గుర్తుచేశారు. సామాజిక న్యాయం.. సమానత్వం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. విజయవాడలో ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం ప్రజల జీవన విధానాలను మెరుగుపరచడమే అని అన్నారు.

Read More..

తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను తిడితే జగన్‌కు నచ్చుతుందా?



Next Story

Most Viewed