- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పార్టీని వీడనున్న మరో YCP MLA.. ఏ పార్టీలో చేరనున్నారంటే..!?
దిశ వెబ్ డెస్క్: ఆంద్రప్రదేశ్ సీఎం జగన్ కి మరో బిగ్ షాక్ తగిలింది. కృష్ణ జిల్లా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పార్ధసారథి వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీ లో చేరనున్నారు అని ప్రచారం జోరుగా సాగుతోంది. తాజగా వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న అలానే ఈ రోజు కూడా పార్ధసారథితో వైసీపీ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి భేటీ అయ్యారు. చాల సమయం పార్ధసారథితో చర్చించారు. అయినా పార్ధసారథి పార్టీ తీరు పైన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా మరో వార్త కూడా చక్కెరలు కొడుతుంది. అదే పార్థసారథి టిడిపిలో చేరే ముహూర్తం కూడా ఖరారు అయింది అన్న వార్త జోరుగా ప్రచారం అవుతోంది. నిన్న రాత్రి పార్థసారథితో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈనెల 18వ తేదీన గుడివాడలో చంద్రబాబు నిర్వహిస్తున్న రా..కదలిరా బహిరంగ సభలో పార్థసారథి సైకిల్ ఎక్కనున్నారనే అనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గతంలో ఆయన వైసీపీ పైన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్ధసారథి పార్టీ మారనున్నారు అని వస్తున్న వార్తలు వాస్తవమే అన్నట్లు రాజకీయ వర్గాల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా కృష్ణాజిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే గా ఉన్న పార్థసారథి పార్టీని వీడడం వైసీపీకి కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.