కదం తొక్కిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు

by Dishafeatures2 |
కదం తొక్కిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు
X

దిశ, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం ముందు సీఐటీయూ జిల్లా నాయకుడు అచ్యుత్ ప్రసాద్ ఆధ్వర్యంలో తమకు జీతాలు రావడంలేదని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా బకాయిలు ఇవ్వడం లేదని, కూరగాయల బిల్లులు ఇవ్వడంలేదని ఆరోపించారు. రాజకీయ నాయకులు, అధికారులు, సూపర్ వైజర్ల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని వాపోయారు. ఉద్యోగం చేయాలంటేనే భయమేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రి ఇలాకాలోనే మహిళా ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు నాగమణి ఆరోపించారు. రోజురోజుకు అంగన్వాడీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోందని, ఈ క్రమంలోనే చాలా మంది ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలకు నెలకి రూ.26 వేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు కోరారు.



Next Story